గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఓ ఎమ్మెల్యే.. ఉన్నట్టుండి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. దీంతో.. ఈ పరిణామన్నా సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానం.. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఘటన అసోంలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు.. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం.. వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది.. అసలు రాజీనామా చేయడానికి గల కారణాలను స్పష్టంగా చెప్పాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపేశ్ భోరా… ఇవాళ సుశాంత బోర్గోహైన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు.. సుశాంత బోర్గోవైన్‌పై చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు.. కాగా, థౌరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన సుశాంత బోర్గోహైన్.. పార్టీకి రాజీనామా చేయడం.. ఆయన రాజీనామాను ఆమోదించడం కూడా జరిగిపోయాయి. అయితే, భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధం అయ్యాడని.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తిచేశారని.. అందుకోసమే కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పారనే చర్చ సాగుతోంది.