టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ తోడు దొంగలు.. వారివల్లే హుజురాబాద్‌లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. దళిత బంధు ఆపడంలో టీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలు.. ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడం అని విమర్శించారు.. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్.. దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు పాత…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…
కాంగ్రెస్ పార్టీకి అసలు అధ్యక్షుడు ఎవరు? కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకుంటారు.. ఎన్నిక విధానం మారాలి అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా చర్చ సాగుతోంది.. దీనిపై జీ -23 టీమ్ బహిరంగంగానే పార్టీని టార్గెట్ చేసింది.. అయితే, ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీరియస్‌గా స్పందించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించే ప్రయత్నం చేస్తూ..…
పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్. ఒక వ్యక్తి రానుండటంతో పాతవాళ్లకు గుబులు పట్టుకుందట. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీపడే పరిస్థితి. పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో ఈ పొలిటికల్ వార్ ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరా నాయకులు? ఎర్ర శేఖర్ చేరితే జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చేనా? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లపై ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్క సీటుకే ముగ్గురు పోటీ పడే పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు…
దేశవ్యాప్తంగా లఖింపూర్ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్ నేతులు.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను…
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్సే. ఈ రికార్డును దేశంలోని ఏ రాజకీయ పార్టీ బ్రేక్ చేసే అవకాశం కనుచూపు మేరల్లో కన్పించడం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ గడిచిన దశాబ్దకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్రంలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అధికారానికి దూరమవడంతో ఆ ప్రభావం క్రమంగా రాష్ట్రాలపై పడుతోంది. దీంతో క్రమంగా ఆయా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టును కోల్పోవాల్సి వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే…
యూపీ లో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేసింది అని రేవంత్ రెడ్డి అన్నారు. దీని పై మోడీ అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80శాతం మంది రైతుల సమస్య. 80కోట్లమంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారు. రైతులు తిరగబడి ఎర్రకోట పై జెండా ఎగరేశారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ కు…
దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేయాలని, యువతకు బాధ్యతలు అప్పగించాలని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎంపిక చేయాలని సీనియర్ నేతలు పలుమార్లు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతం కావాలి అంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేపట్టాలి. అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయి. అదే విధంగా, రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కూడా విభేదాలు…
హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి పెరిగింది. నామినేషన్ల పర్వం ముగియడంతో క్యాంపెయిన్లు మొదలయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టగా, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ 20 మందితో కూడిన క్యాంపెనర్ల జాబితాను రిలీజ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ తదితరులు ఈ…
కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీలు.. గాంధీలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ చేజారిపోతే ఆపార్టీ బ్రతికి బట్టకట్టదనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సోనియాగాంధీ ఎంత కష్టమైనా అధ్యక్ష బాధ్యతలను తానే మోస్తున్నారు. ఒక్కసారి అధ్యక్ష పీఠం చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి తెలుసు. అందుకే ఆమె అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు కట్టబెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇస్తేగిస్తే గాంధీ కుటుంబంలోని వారికేనని…