కాంగ్రెస్ పార్టీకి అసలు అధ్యక్షుడు ఎవరు? కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకుంటారు.. ఎన్నిక విధానం మారాలి అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా చర్చ సాగుతోంది.. దీనిపై జీ -23 టీమ్ బహిరంగంగానే పార్టీని టార్గెట్ చేసింది.. అయితే, ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీరియస్‌గా స్పందించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించే ప్రయత్నం చేస్తూ.. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందంటూ.. బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల గట్టి వార్నింగే ఇచ్చారు.. ఏదున్నా పార్టీలో చర్చించడం.. కానీ, రచ్చ చేయొద్దని సూచించారు.
ఇక, ఏఐసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు కూడా సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ.. 2022, సెప్టెంబర్ లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తసీఉకున్నారు.. గతంలో ఒకటి రెండు సార్లు శాశ్వాత అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రయత్నాలు జరిగినా ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు… అయితే, మరికొంత కాలం సోనియానే పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆమెనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే, ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటన తదితర అంశాలపై చర్చించారు.. ఇదే సమయంలో.. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ ఎన్నికల షెడ్యూల్ పై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.