కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి లో ఉంది. ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. అందరికీ సమస్యలు ఉన్నాయి… కానీ పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి. కోమటిరెడ్డి నేరుగా సోనియా గాంధీ తో మాట్లాడే వెసులు బాటు ఉంది. Vh మాట్లాడుతున్నారు కోమటిరెడ్డితో అని చెప్పారు. నేను కూడా ఇంకొంత మంది నాయకులతో మాట్లాడతా… కలిసి పని చేయాల్సిన సమయం ఇది. హుజూరాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు రావడం ఇబ్బందే.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, అంతర్గత కలహాలు, కుమ్ములాట ఇలా ఏవీ కొత్త కాదు.. సందర్భాలను బట్టి అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి.. తాజాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.. కొత్త కమిటీలు వివాదానికి దారితీస్తున్నాయి… ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మండల కమిటీల మార్పిడితో పాత క్యాడర్లో ఆందోళన మొదలైంది.. ఈ పరిణామంపై పాత క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వర్గం పనే అంటున్న మండిపడుతోంది ప్రేమ్ సాగర్…
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. పెంచింది బారెడు.. తగ్గించింది చిటికెడు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘మోదీజీ గత సంవత్సరంలో లీటర్ పెట్రోల్ రూ.28.28, లీటర్ డీజిల్ రూ.27.61 మేర పెరిగాయి. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గించారు. దయచేసి ‘పెద్ద ఉపశమనం’ కలిగించాం అని చెప్పకండి’ అంటూ ఇండియన్ యూత్…
ఆ జిల్లాలో ఉన్నది మూడే నియోజకవర్గాలు. మూడింటికి మూడు కీలక సెగ్మెంట్లే. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ప్రధానపార్టీలు గేర్ మార్చడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లా నాదా.. నీదా అన్నట్టు కార్యక్రమాలు జోరు పెంచారు నాయకులు. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ రాజకీయ ప్రత్యేకత ఏంటి? ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారో అంతుబట్టదు..! నారాయణపేట జిల్లా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పునర్విభజన తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. అవే…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు ఈటల.. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగినా.. కాంగ్రెస్ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం చతికిలపడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్.. ఇలా మరికొందరి నేతలపై…
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం…
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు పాదయాత్రలు చేయగా.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా పాదయాత్రలు చేపట్టనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 33 జిల్లాల్లో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ వెల్లడించారు. ఈనెల 14 నుంచి 21 వరకు తెలంగాణ వ్యాప్తంగా 2,300 కిలోమీటర్లు మేర ప్రజాచైతన్య పాదయాత్ర…
ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ లతో పాటు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరిపైఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ నేతలు కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో గోరఖ్పూర్ ఎన్నికల్లో పాల్గొంటున్నారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ‘మేం చావనైనా చస్తాం..కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోం’ అంటూ తీవ్రంగా…
హుజురాబాద్లో గాలి ఎటువైపు వీస్తుందో ఎవరికీ అంతుబట్టటం లేదు. ఓటరు నాడి పట్టుకోవటంలో పార్టీలు విఫలమయ్యాయి. నిజానికి ఈ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న యుద్ధంగా ఓటరు భావిస్తున్నాడు. అందుకే ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నాడు. అయితే నియోజకవర్గంలో వివిధ వర్గాల వారిని కలిసి వారితో సంభాషించినపుడు.. ఓటరు మదిలో ఏముందో కొంతైనా అర్థమవుతుంది. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినా.. కారణం ఏదైనా.. ఈటల రాజేందర్ స్థానిక నేత. ఆయనకు స్థాన బలం సహజం. మరోవైపు టీఎస్ఆర్…
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్లో టీఆర్ఎస్…