కాంగ్రెస్‌లో మెంబర్ షిప్.. అంత ఈజీ కాదట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ పార్టీల్లో మెంబర్ షిప్‌లు చాలా ఈజీగా లభిస్తాయి. మన పేరు చెప్పి వందో, రెండువందలో కడితే మెంబర్ షిప్, దానికి అదనంగా బీమా సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పురాతన పార్టీ కాంగ్రెస్‌లో మెంబర్ షిప్ తీసుకోవడం అంత ఈజీగా కాదు.
పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాలి. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయాలి. పార్టీ విధానాలను బహిరంగంగా ఎట్టి పరిస్థితుల్లో విమర్శించమని ప్రమాణం చేయాలి.
Also Read
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
కొత్త ఫారం ప్రకారం సభ్యత్వ నమోదుకు ముందు.. కొత్త సభ్యులు కొన్ని వ్యక్తిగత వాగ్దానాలు చేయాలట. సభ్యత్వ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 వరకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఇటీవలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ నిర్ణయాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. కొత్తగా సభ్యులు కావాలనుకునేవారికి ఎక్కువ ఆస్తి వుండకూడదు. సీలింగ్ చట్టం ఖచ్చితంగా పాటించాలి. పార్టీ విధానాలు, కార్యక్రమాలలో విధిగా పాల్గొనాలి. పార్టీ కోసం పనిచేయడానికి వెనుకాడకూడదట.
మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఖాదీ దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. సామాజిక వివక్ష ఉండకూడదు. అందరినీ సమానంగా చూడాలట. సమాజంలో వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలి. కొత్త నిబంధనలు రాజ్యాంగంలో భాగమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్ మిస్త్రీ చెప్పడం విశేషం.
కొత్త, పాత సభ్యులందరూ అన్ని నియమాలను పాటించాలంటున్నారు. కాంగ్రెస్‌లో సభ్యత్వం కావాలనుకునేవారికి ఇన్ని నియమాలు పాటిస్తారా? మాకెందుకు మీ పార్టీ సభ్యత్వం అనుకుంటే మాత్రం మెంబర్ల సంఖ్య అంత పెరగకపోవచ్చు. రాజకీయంగా ఎదగాలని కాస్త మనీ పవర్, మజిల్ పవర్ వున్నవారే ఈ సభ్యత్వాన్ని స్వీకరిస్తారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!