హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్న రీతిలో దూసుకెళుతున్నాయి. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా మైదానంలోకి దిగనట్లే కన్పిస్తోంది. పోలింగ్ తేదికి మరో 23రోజులే ఉన్నా కాంగ్రెస్ మాత్రం జోరు చూపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఆపార్టీ నేతలతీరు ఉంది. దీంతో అసలు కాంగ్రెస్ రేసులో ఉందా? లేదంటే సైడ్ అయిందా?…
యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఈరోజు ఉదయం నుంచి అన్ని రాష్ట్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ధ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. లఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి కుమారుడి కారు…
పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి చిక్కులు తప్పడంలేదు. ఓవైపు సొంత పార్టీనుంచి మరోవైపు విపక్షాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి. కొత్తగా నియమించిన డీజీపీ, అడ్వొకేట్ జనరల్ లను తొలగించాల్సిందేనని సిద్ధూ పట్టుబడుతుండగా, ఉన్నతస్థాయి సమావేశానికి సీఎం కొడుకు హాజరవడంపై విపక్షాలు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్‌ను ఏదో ఒకటి చేసేవరకు సిద్ధూ విశ్రమించేలా లేడు. కోరి ముఖ్యమంత్రి చేసిన చరణ్ జిత్ సింగ్ చన్నీతో అప్పుడే గొడవకు దిగాడు. డీజీపీ, అడ్వొకేట్ జనరల్…
హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి.…
హుజురాబాద్ అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపిస్తోందా? సీరియస్ ఫైట్ ఇస్తుందా.. ఇంకెవరికైనా సాయపడాలని చూస్తోందా? మాజీ మంత్రి కొండా సురేఖ ఎందుకు బరి నుంచి తప్పుకొన్నారు? పార్టీ ముందు డిమాండ్ల చిట్టా పెట్టిన కొండా సురేఖ?చివరకు పోటీకి విముఖత వ్యక్తం చేసిన సురేఖ..! హజురాబాద్‌లో నామినేషన్ల ఘట్టం మొదలైనా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు. అభ్యర్ధి ఎంపిక కసరత్తును కొలిక్కి తెచ్చే పనిలో పడింది పార్టీ. మొదటి నుంచీ మాజీ మంత్రి కొండా సురేఖను…
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగలేను.. బీజేపీలో చేరను అని ప్రకటించిన అమరీందర్.. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కొత్త పార్టీకి.. పంజాబ్ వికాస్ పార్టీ అని పేరు పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు…
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉంది. తొలి నుంచి సామాన్యుడి కష్టాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో ‘చీపురు’తో ఊడ్చి పారేశారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా ఎంటో నిరూపించారు. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపార్టీకి దేశ రాజధానిలో తిరుగు లేకుండా పోతుంది. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది. తెలంగాణలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. విద్యార్థి- నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ… కార్పొరేట్…
ఎట్టకేలకు హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్. బలమూర్ వెంకట్ పేరును ఫైనల్ చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్…