Off The Record: గుళ్ళో అఖండ దీపంలాగే… తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్య అసంతృప్తి అన్నది కామన్. పార్టీ అధిష్టానాన్ని తప్ప మిగతా నాయకులు ఎవరు ఎవరి మీదైనా బహిరంగ వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. అందుకు స్థాయీ భేదాలేమీ ఉండవు. అయితే కొంత కాలంగా టి కాంగ్రెస్ పరిణామాల్ని చూస్తున్నవారికి అసలు అసమ్మతి అన్నది కాంగ్రెస్ లీడర్స్‌కి ఇన్‌బిల్ట్ డీఎన్‌ఏలా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌కి పిసిసి చీఫ్…
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు అడుగుల ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. నాయకుల మధ్య సమన్వయలేమితో పాటు ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. జిల్లాపై పట్టు కోసం నాయకుల మధ్య పోటీ పెరగడంతో పార్టీ బలోపేతం పక్కకు వెళ్ళి పంచాయతీలు తెరమీదికి వస్తున్నాయి. ఇవి ముదిరి డీసీసీ అధ్యక్షుల మార్పు దాకా వెళ్తున్నాయి. ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షుడిని మార్చాలని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు రాష్ట్ర ఇన్ఛార్జ్…
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
హైదరాబాదులో కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ సిట్ విచారణకు రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోలీసులు హౌస్ చేశారు.
Manik Rao Thackeray : మాణిక్ రావు ఠాక్రే తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి.
BJP MP Laxman: శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ వేదికగా మార్చుకున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు చేశారని ఆయన అన్నారు.
Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చాలాకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. పరస్పరం పోలీస్‌లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన గొడవగా కార్యకర్తలు భావించడం లేదట. కొంత కాలంగా లక్ష్మారెడ్డి మిర్యాలగూడ టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ…
మధుయాష్కీ. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్. గతంలో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఉన్న జిల్లా నిజామాబాద్. యాష్కీతోపాటు మరో ఇద్దరు కీలక నేతలుకు పీసీసీలో పదవులు ఉన్నాయి. కానీ.. నాయకులంతా ఎవరికివారే. ఇటీవల టీపీసీసీ కమిటీ కూర్పు రాష్ట్రస్థాయిలో నేతలను రెండుగా చీల్చేసింది. మీడియా ముందు ఓపెన్‌గానే విమర్శలు.. సవాళ్లు చేసుకున్నారు నేతలు. ఆ సమస్యపై కాంగ్రెస్ హైకమాండ్ చికిత్స చేస్తున్నా.. పీసీసీ…