డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.
తెలంగాణ రాజ్ భవన్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ.. గవర్నర్‌కు లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ముఖ్య నేతలు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ…
Telangana Elections : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 8:15 గంటలకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
BRS Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వరుస షాక్ లు తగులుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ లు రాజీనామా చేశారు.
Akbaruddin: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య మాటల పటాకులు పేలుతున్నాయి. ఈ క్రమంలో వేలం పాటకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హెచ్చరించారు.
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతతృప్తుల బుజ్జగింపులు దాదాపు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించిన భంగపడ్డ 20 మంది నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లడుతున్నారు.