రీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కరీంనగర్ సభ నేపథ్యంలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేసావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు.
తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్ ఎస్ యు ఐ నాయకుడి వివాహానికి హాజరైన ఇద్దరు నేతలు, ఆ పెళ్లి వేడుకను తమ రాజకీయ, వర్గ విభేదాలకు వేదికగా మార్చుకోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితమే వరంగల్ లో రాహుల్ సభ విజయవంతం కావడం, కలసి పని చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు పన్నెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్…
కాంగ్రెస్‌కు మరోసారి శక్తిని నింపేలా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో పార్టీ చింతన్ శిబిర్ మేధోమథనం చాలా అంశాలను టచ్ చేసింది. అందులో చర్చకు వచ్చిన వాటిల్లో హాట్ టాపిక్‌గా మారింది మాత్రం.. పార్టీ నాయకుల కుటుంబంలో ఒకరికే టికెట్. దీనిపై పార్టీ చీఫ్ సోనియాగాంధీనే నిర్ణయం ప్రకటించారు. మేడమ్ ఆ మాట చెప్పినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లకు గుబులు పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయడంతోపాటు మరోచోటు నుంచి వారసులను లేదా కుటుంబ సభ్యులను బరిలో…
ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ.. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని చెప్పిన ఆయన.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని సూచించారు. కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టుకుండా.. నేతలందరూ…
ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న సమయంలో పార్టీలు పొత్తు పెట్టుకోవడం సహజం. ఇది రాజకీయ తంత్రం.. ఎప్పుడు, ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్న వాళ్ళే రేపు చేతులు కలపొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో పొత్తు చర్చలు మొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. రైతు సంఘర్షణ సభలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కాంగ్రెస్…
వరంగల్ హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అన్నారు ప్రజలంతా టీఆర్ఎస్ పాలనపై అసహనంతో వున్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు. ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం…