తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు సీనియర నేతలు ఈ భేటీకి హాజరుకాబోతున్నారు అని టాక్. అయితే ఈ భేటీలో కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు ఏ రకమైన సలహాలు ఇస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ తాజా రాజకీయాలు.. కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి పార్టీ హైకమాండ్ రిపోర్టులు తెప్పించుకున్నట్లు టాక్.
Also Read : Most Miserable Country: అత్యంత “దుర్భరమైన దేశం”గా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?
తెలంగాణలో పార్టీ విజయం సాధించాలంటే అనేక అంశాలపై ఫోకస్ చేయాలని.. అందులో ముఖ్యంగా నేతల మధ్య సఖ్యత ఉండాలని.. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగితే గెలుపు సాధ్యమవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదికలు అందినట్టు పక్కా సమాచారం. దీంతో ఈ నెల 26న జరగబోయే సమావేశంలో నేతల మధ్య సఖ్యత కుదిర్చే అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. కర్ణాటక ఫలితాలు తెలంగాణకు కలిసొచ్చే అంశమని పార్టీ హైకమాండ్ బలంగా నమ్ముతోంది.
Also Read : Minister Errabelli : సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి
నేతలు ఐక్యంగా ముందుకు సాగడంతో పాటు ముఖ్యనేతలకు పలు బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని వార్తలు వినిపబడుతున్నాయి. అయితే ఎవరికి ఏయే బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పటికప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం లేదని.. నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తుందని చర్చించుకుంటున్నారు.
Also Read : Canada: “రన్నింగ్ చేస్తే తీవ్రమైన అలర్జీ”.. అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళ..
ఇక టీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ అసలు తెరపైకి రాకుండా చూడాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ముందుగా నేతలంగా కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలని.. ఆ తరువాతే ఇలాంటి అంశాలపై ఫోకస్ చేయొచ్చని కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు స్పష్టం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యనేతలు తరచూ తెలంగాణలో పర్యటించేందుకు వస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఢిల్లీలో జరగబోయే భేటీలో ఏయే అంశాలపై నేతలకు దిశార్దేశం చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.