Off The Record: సెగలు రాజేస్తున్న మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయం.. ఆఫీసులోనే నేతలు ఘర్షణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చాలాకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. పరస్పరం పోలీస్‌లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన గొడవగా కార్యకర్తలు భావించడం లేదట. కొంత కాలంగా లక్ష్మారెడ్డి మిర్యాలగూడ టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ జనాల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు లక్ష్మారెడ్డి. అయితే టికెట్ రేస్‌లోకి మరికొందరు రావడంతో కాంగ్రెస్ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయి.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్‌పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి
Also Read
మిర్యాలగూడలో కొద్దిరోజులుగా జరుగుతున్న గొడవలను ఉత్తమ్, జానారెడ్డిల దృష్టికి లోకల్ లీడర్స్ తీసుకెళ్లారట. ఎవరొచ్చినా వారు వింటున్నారే తప్ప పరిష్కరించడం లేదని కేడర్ మాట. 2014లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడి.. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన అమరేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనకు జానారెడ్డి ఆశీసులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే జానారెడ్డే మిర్యాలగూడ సీటును తన కుమారుడి కోసం అడుగుతున్నారనే వాదనా ఉంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కేంద్రంగా వివాదాలు జరుగుతున్నాయని.. ఆయన జానారెడ్డికి అత్యంత సన్నిహితుడనేది లక్ష్మారెడ్డి ఆరోపణ. జానారెడ్డి మిర్యాలగూడలో తన కుమారుడికి లైన్ క్లియర్ చేసుకునేందుకే పార్టీలో గొడవలు సృష్టిస్తున్నారనేది మరో విమర్శ. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో జానారెడ్డి కీలక పాత్ర పోషిస్తారని.. అందుకే ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఆయనకు తెలియకుండా జరుగుతాయా అనేది పార్టీ వర్గాల ప్రశ్న. లక్ష్మారెడ్డి వర్గం ఈ అంశాన్నే బలంగా వినిపిస్తోంది. అయితే లక్ష్మారెడ్డి వర్గం చేస్తున్న ఈ వాదనను జానారెడ్డి వర్గం ఖండిస్తోంది. మొత్తానికి వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ మిర్యాలగూడ కాంగ్రెస్‌లో జూనియర్ వర్సెస్ సీనియర్ రగడ రానున్న రోజుల్లో మరింత పీక్స్‌కు వెళ్తుందని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!