Manik Rao Thackeray: మాణిక్ రావు ఠాక్రే తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. మాణిక్ రావ్ మాట ఏఐసీసీ పెద్దల దగ్గర చెల్లుబాటు అవుతుండడంతో టీకాంగ్రెస్ నేతలెవరూ కిమ్మనడం లేదు. దీంతో పార్టీలో వేగం పుంజుకుంది. నాయకుల మధ్య వివాదాలు పూర్తిగా తగ్గనప్పటికి కొంతవరకు అంతా సైలెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్లు మద్దతివ్వకపోయినా.. అడ్డుకోవడం మాత్రం ఆగింది. ఇటీవల మాణిక్రావు ఠాక్రే ఆయన వరుసగా నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలతో భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఎవరితో ఏం మాట్లాడినా అంతా రాసుకుంటూ నివేదికలు తయారుచేస్తున్నారు. ఆ రిపోర్టులు ఢిల్లీకి పంపిస్తున్నారు.
Read Also: Crime News: ఫామ్ హౌస్లో మహిళ హత్య .. భర్తే చంపేశాడా..?
ఈ క్రమంలోనే ప్రతీ ఇంటికి రాహుల్ గాంధీ సందేశం చేరాలంటూ నేతలకు ఆయన సూచనలు చేశారు. ప్రతీ ఇంటికి హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించాలన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం.. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోంది దీనిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందంటూ… ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేతలందరూ కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. మండల స్థాయి నేతలు హాత్ సే హాత్ జోడో ను ముందుకు తీసుకెళ్లాలన్నారు. 15 రోజుల్లో మళ్లీ వచ్చి మరోసారి సమావేశం నిర్వహిస్తానన్నారు. జిల్లా లలో నిర్వహించే సమావేశానికి పార్టీ అనుబంధ విభాగాలన్నింటిని పిలవాలని నేతలకు సూచించారు. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి .. జోడోయాత్ర ను కలిసికట్టుగా చేయాలని పిలుపునిచ్చారు.