ప్రగతి భవన్ లో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. తెలంగాణాలో జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి కొరత ఏర్పడుతోందన్న టీ సర్కార్…అధిక నీటిని వాడుతున్న ఏపీని నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు…
సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగి పరిశీలించారు. పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా ఉండాలని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు. గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు…
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు.…
కేసీఆర్ రైతు బందు ప్రకటించినప్పుడు ఎలక్షన్ కోసమేనని ప్రతి పక్షాలు విమర్శించాయికానీ ఇప్పటవరకు 43 వేల కోట్లరూపాయలు.. 7 విడతలుగా రైతులకు ఇచ్చుకున్నాము. రైతులకోసం భారతదేశంలో ఏ రాష్టం అమలుచేయని సంక్షేమపథకాల్ని తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నాము అని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు వేదికల ద్వారా రైతులు ఏ భూములలో ఎటువంటి పంటలు వేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయం పై సూచనలు చేస్తాము. కేసీఆర్ ఉన్నంత…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్ లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్న దన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కెటిఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత…
కృష్ణా నది వాటాలో 34శాతానికే కేసీఆర్ సంతకం చేశారు. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కృష్ణా నదిపైన మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రగతి పద్దుతో దళితుల అభ్యున్నతికి కట్టబడి ఉందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రగతి పద్దును పూర్తిగా వినియోగించలేదు. 1,91,000 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి…
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మొత్తం ఈ నెల 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది… రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ…
రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానుండటంతో మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. అయితే ఆ మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఇక రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ, గతంలో సీఎం కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్సీ కవిత. అయితే రామగుండంలో మెడికల్…
తన ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం సంతోషమని…వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మోత్కుపల్లి నర్సింహులు. దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని… అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు తప్ప… నేరుగా దళితుల ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదన్నారు. Read Also : ‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ? రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి దళిత…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చినట్టుగానే దత్తత గ్రామం వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల చేశారు.. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. కాలినడకన తిరుగుతూ దళితవాడను పరిశీలించారు.. అక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలను గుర్తించామని… ఆ అన్ని కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున రేపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.. ఆయన చెప్పినట్టుగానే 76 దళిత కుటుంబాలకు రూ.…