జాతీయ చేనేత దినోత్సవం : సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్ లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్న దన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కెటిఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నదన్నారు.
Also Read
బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తు న్నామన్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సిఎం తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామన్నారు. ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరుతో అవార్డులు అందిస్తున్నామని సిఎం అన్నారు. ఎగ్జిబిషన్లు , ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలులోకి తేనున్నామన్నారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. చేనేత కార్మికులకు అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని సిఎం తెలిపారు.
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..