ప్రగతి భవన్ లో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటుందని తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. తెలంగాణాలో జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి కొరత ఏర్పడుతోందన్న టీ సర్కార్…
అధిక నీటిని వాడుతున్న ఏపీని నిలువరించాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ అంశాలపై ఇవాళ సమీక్షలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నారు.