సీఎం కేసీఆర్ నేడు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. గత జూన్ 22న ఆ గ్రామంలో పర్యటించిన సీఎం.. 42 రోజుల తర్వాత మరోసారి గ్రామానికి విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. పల్లెబాట కార్యక్రమంలో తొలుత సీఎం దళితవాడలో పర్యటించి, తర్వాత గ్రామమంతా కలియ తిరుగుతూ…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో బుధవారం పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రికి ఉదయం చేరుకోనున్న సీఎం.. గ్రామంలో పర్యటించనున్నారు.. రైతు వేదికలో గ్రామస్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు 120 మందితో సమావేశం కానున్నారు.. మొదట ముఖ్యమంత్రి గ్రామంలోని దళిత వాడలో పర్యటిస్తారు.. యాబై మందితో కలిసి దళితవాడను పరిశీస్తారు సీఎం.. ఆ తర్వాత రైతు వేదికలో 120…
జల వివాదంలో తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, కేసులు.. ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నాం… అన్నదమ్ముల్లా ఉండాలని మా కోరిక… తగవు పడాలనే ఆలోచనే మాకు లేదన్నారు బొత్స.. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇది వరకు చెప్పారని గుర్తుచేసిన ఆయన.. అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలన్నారు.. ఇక,…
తెలంగాణ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసిన సీఎం కేసీఆరే దళితుల ప్రధాన శతృవు అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏడేండ్లపాలనలో దళితులకు అన్యాయమే జరిగింది, ఏనాడూ దళితబంధు కాలేదు.. కేసీఆర్ రాబందులా కనిపిస్తున్నాడు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరమైన సమయంలో ఎదో నిర్ణయం తీసుకుంటాడు ఆతర్వాత పక్కకు పడేస్తాడు. హుజూరాబాద్ లో మెజార్టీ ఓట్లు దళితుల ఉన్నాయి కాబట్టే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు తీసుకొచ్చాడు,…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అన్నారు.. ఇక, దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్న సజ్జల… కేంద్ర జలశక్తి శాఖ…
కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మల్లిస్తోంది అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిధులు ఖర్చు చేయకపోవటంతో రిటర్న్ వెళ్లాయి. రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యంత్రుల జల జగడం అని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు. కేంద్ర పథకాల అమలుకు టీఆర్ఎస్ సర్కార్ సహకరించటం లేదు. తెలంగాణ పల్లెలకు వచ్చే ప్రతి రూపాయి కేంద్రం నిధులే. హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై ఆయన పలు విమర్శలు చేశారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, జానారెడ్డి మాటతప్పి నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు. దేశానికే ఆదర్శంగా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. దళితబంధుపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని, 12 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అందిస్తున్నామని…
నల్గొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమాన శ్రయానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్… హెలికాఫ్టర్ ద్వారా ఉ.10.40 నిమిషాలకు హాలియా చేరుకోనున్నారు. నాగార్జున సాగర్ చేరుకున్న అనంతరం… ఉ.10.55 నిమిషాలకు మార్కెట్ యార్డ్ లో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.10 నిమిషాలకు స్థానిక ఎమ్మెల్యే…
తెలంగాణలో ప్రస్తుతం దళితబంధుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అర్హులైన పేద దళిత కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దీని విధివిధానాలపై ఆయా వర్గాలతో చర్చలు జరిపారు. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు… ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత…