హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించేసింది. ఈ మేరకు టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో…
హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లను నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా..ఇవాళ హుజురాబాద్ ఉప ఎన్నికపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాదు..…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్…
త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామన్న ఆయన.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని చెప్పారు.. ఇక, ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవనాన్ని నిర్మిస్తామన్న సీఎం.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని గుర్తుచేసిన తెలంగాణ సీఎం.. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా,…
ఈఏడాది కూడా స్వాతంత్ర్యదినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్… ఇవాళ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్.. స్వాతంత్ర్యదినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట పట్టణంలోని ఎంపిఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దేశానికి దిక్సూచి దళిత బంధు పథకం. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చూశారు. దళితుల దారిద్రయాన్ని పోగెట్టెందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. ఒక దళిత కుటుంబానికి నేరుగా రూ.10లక్షలు ఖాతాలో వేయడం సంతోషకరమైన విషయం అన్నారు. రూ.500కోట్లు కేవలం మొదటి వీడుత మాత్రమే. రాష్ట్ర…
బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తొలిరోజే టార్గెట్ చేశారు.. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్న ఆయనకు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను…
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాసాలమర్రిలో ఇచ్చినట్టుగా.. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా దళిత బంధు ఇస్తే.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీకూడా చేయనని స్పష్టం చేశారు. కావాలంటే బాండ్ కూడా రాసిస్తానన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోజరిగిన కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి… నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యమని.. తర్వాతే పదవులు అన్నారు. ఇక, ఎవరు…
తెలంగాణకు నది అంటేనే మూసి… దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చౌటుప్పల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంట్ లో మాట్లాడుతా అని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు. సీఎం వాసలమర్రి కి రెండు సార్లు వస్తే,ఎంపీ గా నాకు సమాచారం ఇవ్వలేదు .ఈ ప్రబుత్వం లో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీ లకు ప్రోటోకాల్ ఇవ్వరు. సీఎం పక్కన కూర్చుంటే ఆయన…
ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…