టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.