హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఎలాగైనా హుజురాబాద్ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.…
టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశ క్రీడాకారులు హాకీ , బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. తద్వారా దేశీయ క్రీడ హాకీ విశ్వక్రీడా వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .ఇందుకు తీవ్రంగా కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ ను, జట్టు క్రీడాకారులను…
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు మాజీమంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ లో గెలవడానికి రూ. 150 ఇప్పటికే పంపిణీ చేశారని ఆరోపణలు చేశారు. తాను సీరియస్ రాజకీయ నాయకుణ్ణి అని.. డ్రామా మాస్టర్ ని కాదన్నారు. తన కున్న ఆప్షన్ పాదయాత్ర నేనని… తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. 3,4 రోజులు వాకింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత పాద యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు. 5…
వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించింది సర్కార్.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను…
సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. 11వ తేదీ నుండి హుజూరాబాద్ లో 7 సభలు. మండల కేంద్రాల్లో సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేసారు. ఈటల మీద విచారణ జరిపిన నివేదికలు ఏమయ్యాయి అని ప్రశ్నించిన ఆయన ఈటల బీజేపీ లో చేరడానికి కేసీఆర్ కారణం అని పేర్కొన్నారు. ఈటల బీజేపీ లో చేరిన వెంటనే విచారణలు ఎందుకు ఆగిపోయాయి. హుజురాబాద్ నియోజక వర్గ అభ్యర్థిత్వం…
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సీఎం కేసీఆర్.. ఇవాళ ఆ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు.. సీఎం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు.. రేపటి నుంచి వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం.…
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత.…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…
తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు… సుమారు 3 గంటలపాటు ఆయన పర్యటన కొనసాగింది.. దళిత కుటుంబాల మహిళలు కేసీఆర్‌కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు…