కేసీఆర్ రైతు బందు ప్రకటించినప్పుడు ఎలక్షన్ కోసమేనని ప్రతి పక్షాలు విమర్శించాయి
కానీ ఇప్పటవరకు 43 వేల కోట్లరూపాయలు.. 7 విడతలుగా రైతులకు ఇచ్చుకున్నాము. రైతులకోసం భారతదేశంలో ఏ రాష్టం అమలుచేయని సంక్షేమపథకాల్ని తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నాము అని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు వేదికల ద్వారా రైతులు ఏ భూములలో ఎటువంటి పంటలు వేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయం పై సూచనలు చేస్తాము. కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. భవిష్యత్తులో దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శం కానుంది అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఆదాయం 10 రెట్లు పెరిగింది. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. 2కోట్ల 48లక్షల మంది రైతుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో లభించని మద్దతు ధర తెలంగాణ రాష్ట్రం లో రైతులకు లభించింది. అక్కడ రైతులకు ఉచిత విద్యుత్ కూడా అమలు చేస్తలే అని తెలిపారు. రైతుల రుణమాఫీ మొదటి విడతగా 25 వేలలోపు గతంలో మాఫీ చేసుకున్నాము. ఇప్పుడు 50 వేల లోపు ఋణాలు మాఫీ చేస్తున్నాము. సుమారు 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల భూ సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాము.