రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానుండటంతో మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. అయితే ఆ మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.
ఇక రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ, గతంలో సీఎం కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్సీ కవిత. అయితే రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ ని కలిసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రామగుండంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజ్ లో 25% ఎంబీబీఎస్ సీట్లను సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు మంత్రి కేటీఆర్ గారిని కోరారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. సింగరేణిలో ప్రస్తుతం కార్మికుల వారసులకు ఇస్తున్న ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లలో ఉన్న చిన్న చిన్న అక్షర దోషాలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలోనూ సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకునేలా సిఎండి తో మాట్లాడతామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్ రావు,ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కెంగర్ల మల్లయ్య పాల్గొన్నారు. రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ ని కోరారు.