ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చినట్టుగానే దత్తత గ్రామం వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల చేశారు.. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. కాలినడకన తిరుగుతూ దళితవాడను పరిశీలించారు.. అక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలను గుర్తించామని… ఆ అన్ని కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున రేపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.. ఆయన చెప్పినట్టుగానే 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నిధుల విడుదలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. వాసాలమర్రి దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ అసెంబ్లీలో ఈ పథకాన్ని అమలు చేయాలని భావించారు.. అయితే, దీనిపై కొన్ని రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి.. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే దళితుల ఓట్ల కోసం సీఎం కేసీఆర్.. ఈ పథకాన్ని తెచ్చారనే విమర్శలు వచ్చాయి.. అయితే, నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం.. అనూహ్యంగా.. ఈ గ్రామం నుంచే దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని ప్రకటించారు.. నా నోట్లకెళ్లి మాట ఎళ్లిన దగ్గరి నుంచి మీరు పది లక్షల శ్రీమంతులు అయ్యారని.. రేపు 11 గంటల వరకు డబ్బులు వస్తాయని.. 10 లక్షల్లో 10 వేలు మాత్రమే రక్షణ నిధికి పోతాయి.. మిగతా మొత్తం మీదే.. కానీ, ఆ డబ్బుతో ఏం చేయాలని అనేది జాగ్రత్తగా లోచించాలని… అందులో నుంచి ఖర్చు చేయడం కాదు.. దానిపై వచ్చే మొత్తాన్ని ఖర్చు చేసుకోవాలి.. పైసాపైసా పోగుచేసుకోవాలని తెలిపిన సంగతి తెలిసిందే.