కృష్ణా నది వాటాలో 34శాతానికే కేసీఆర్ సంతకం చేశారు. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కృష్ణా నదిపైన మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రగతి పద్దుతో దళితుల అభ్యున్నతికి కట్టబడి ఉందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రగతి పద్దును పూర్తిగా వినియోగించలేదు. 1,91,000 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి అని తెలిపారు. ఏడేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తే 31వేల మంది దళిత నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేది. కేసీఆర్ దళితులను వంచించి మోసం చేశారు. తెలంగాణలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుతున్నాయి. కేసీఆర్ సర్కార్ దళిత వ్యతిరేకి ప్రభుత్వం అని పేర్కొన్నారు.