తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ముఖ్యంగా కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం గురించి.. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల్లో రాష్ట్రం వాటా నిధుల వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నా ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం రాష్ట్ర వాటా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఇవాళ రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదిలాబాద్‌లోని ఆర్‌జీఐఎంఎస్ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర షేర్‌ని వెంటనే ఇవ్వాలని లేఖలో కోరారు కిషన్‌రెడ్డి.. ప్రధాన మంత్రి స్వాస్థ సురక్ష యోజన పథకం కింద రాష్ట్రం నుంచి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ RGIMS గుర్తించి ఒక్కో కాలేజీకి రూ. 120 కోట్లు కేంద్రం కేటాయించిందని.. కేంద్రం తన వాటా ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు లేఖలో పేర్కొన్న పేర్కొన్న కిషన్ రెడ్డి. సిబ్బందిని కూడా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
Read Also: KCR: జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ..