ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. కౌలు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిది.కాయకష్టం చేసే కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మీ సహా ప్రభుత్వ పథకాలేవీ వర్తించకపోవడం అన్యాయం. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందే సౌకర్యం కూడా కౌలు రైతులకు లేకపోవడం దారుణం. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఏ ఒక్క…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగం వుండడం లేదు. ఈ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా తిప్పికొట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం కెసిఆర్ సమక్షంలో సభలు హుందాగా జరిగాయి..జరగబోతున్నాయి. అధికార పార్టీ సభ్యుల కంటే…ప్రతిపక్ష పార్టీ సభ్యులకే ఎక్కువ సమయం ఇస్తుంది మేమే. విపక్ష సభ్యులు ఇక చాలు అనే వరకు సమాధానాలు ఇస్తున్నాం. .…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీలు వరుసగా మాటల దాడి చేస్తూనే వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై మళ్ళీ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సోమవారం తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడలో బండి సంజయ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మహా శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ కాదు. వేములవాడలో శివరాత్రి సందర్భంగా ఒక…
అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. జీఎస్‌డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం…
నేడు ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీల అమలు జరుగనుంది. తెలంగాణ ఈ చలాన్ వెబ్‌సైట్‌లో చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించనున్నారు. నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ ఆలయాలు దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల అలంకరణతో మెరిసిపోతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంపై ఆయన మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉంది. మహిళా గవర్నర్ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నవా? రాష్ట్రపతి ప్రతినిధిని, రాష్ట్ర తొలి పౌరురాలిని గౌరవించే…
సీఎం కేసీఆర్ ఈమధ్యకాలంలో జిల్లాల పర్యటనలు బాగా చేస్తున్నారు. తాజాగా మరో పర్యటనకు తెరతీశారు. వనపర్తి నుండి “మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని సిఎం కేసిఆర్ ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా…
సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్…
తెలంగాణలో ఆడపిల్లలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ. నిర్మల్ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ నిర్మల్ నుండి మైనర్ బాలికను హైదరాబాద్ కి తీసుకువచ్చి అత్యాచారం చేశారు. తవరకు అతడిని అరెస్ట్ చేయలేదు. టి ఆర్ ఎస్ నాయకుడు కాబట్టే ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అలాగే, సిరిసిల్లలో ఒక అమ్మాయి మిస్ అయ్యి నెల రోజులు అయింది. కేటీఆర్ నియోజకవర్గంలో అమ్మాయి…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ ఎం డోబ్రియల్ ను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్)గా నియమించిది ప్రభుత్వం. తెలంగాణకు హరితహారం స్టేట్ నోడల్ ఆఫీసర్ గా గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు డోబ్రియల్. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కొత్త అధిపతిగా సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం పీసీసీఎఫ్ గా ఉన్న ఆర్. శోభ ఇవాళ్టితో పదవీ విరమణ పొందటంతో డోబ్రియల్ కు పీసీసీఎఫ్ గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్…