జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చించారు.. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ తండ్రి శిభు సోరెన్‌ను కూడా కలిశారు కేసీఆర్.. ఆయనకు పాదాభివందనం చేసిన తెలంగాణ సీఎం, శాలువా కప్పి సత్కరించారు.. తాజా రాజకీయ పరిస్థితుల చర్చల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఇక, ఈ సమావేశం కంటే ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.