జనగామ పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జనగామ మున్సిపాలిటీ, చంపక్ హిల్స్‌లో మానవ విసర్జీతాల శుధ్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ మున్సిపాలిటీ లోపల మల శుద్దీకరణ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. 2 కోట్ల 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి కేంద్రం ఇది ఆయన వెల్లడించారు. కేసీఆర్ దయవల్ల జనగామను జిల్లా చేసుకున్నామన్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం విశాలంగా ఉందని సీఎం కేసిఆర్ అభినందించారని ఆయన తెలిపారు.
కలెక్టర్ కార్యాలయం కోసం పార్టీలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జనగామకు 300 కోట్లతో మెడికల్ కాలేజీకి ప్రాణళిక సిద్దం చేసి వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఆమోదించనున్నామని ఆయన పేర్కొన్నారు. మనఊరు మనబడి కోసం 700 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాటశాల లను పునరుద్దరిస్తున్నామన్నారు.