తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…
ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు సాధించుకున్నట్లే ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో భాగంగా 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచే నోటిఫికేషన్‌లు జారీ అవుతాయని తెలిపారు. ఇకపై వివిధ శాఖలలో ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాలు…
తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. అందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పోలీస్…
తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో తానూ కూడా లాఠీదెబ్బలు తిన్నానని తెలిపారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలుగా అన్యాయానికి గురైందని సీఎం కేసీఆర్ అన్నారు. సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాషను కమెడియన్లకు వాడేవారని.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా…
తెలంగాణ ఉద్యమం, అనంతరం తెలంగాణ సాధన విషయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మరోమారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం.. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్. ఈ రోజు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు.. ఒకప్పుడు…
సీఎం కేసీఆర్.. అసెంబ్లీలో బడ్జెట్ పై ప్రసంగించబోతున్నారు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నారు.. అందరూ తన ప్రసంగం వినాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై.. నిరుద్యోగుల్లో మొదటి నుంచి అసంతృప్తి ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని ప్రచారం చేశారని… ఈ హామీ నిలబెట్టు కోలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటు విపక్షాలు, అటు నిరుద్యోగులు ఆందోళనబాటలో ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్. ఇందులో మొదటి రెండింటి విషయంలో న్యాయం జరిగిందన్న…
సీఎం కేసీఆర్‌పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? మమ్ముల్ని బంగాళా ఖాతంలో కలుపుతానంటవా? నీ తరం కాదు.. నీ అబ్బ తరం కాదు అంటూ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా మేం గోల్ మాల్ గోవిందలమా?…… ప్రపంచ గోల్ మాల్ గోవిందాలకు అధ్యక్షుడివి నువ్వే… గోల్డ్ మెడల్ నీదే అని అన్నారు. అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలన్నారు.…
సీఎం కేసీఆర్ ఈ రోజు వనపర్తి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు సంచలన ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదని, బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదివేలో, 20 వేలో…
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్‌గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా…