సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తెలంగాణ బంగారు అయ్యిందని, ఇక దేశాన్ని బంగారు దేశంగా మర్చుతా అని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని, ప్రజలు అభివృద్ధి చెందుతారు అని సోనియా గాంధీ అనుకున్నారని, కానీ కేసీఆర్ ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు.
గవర్నర్ ని కూడా బడ్జెట్ సమావేశానికి రాకుండా చేశారు కేసీఆర్ అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నేనే రాజు..నేనే మంత్రి అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉందని ఆయన మండిపడ్డారు. గవర్నర్ మాట్లాడటం అంటే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు అని, గవర్నర్ మాట్లాడక పోతే… ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరు ఇస్తారని ఆయన అన్నారు. ఇది రాజ్యాంగ సంక్షోభం అని ఆయన వ్యాఖ్యానించారు.