తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభలోకి ప్రవేశించారు. రాజ్యాంగము బుక్ తో సభ లోకి భట్టి విక్రమార్క ప్రవేశించారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.
ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు. సీఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధిస్తోంది. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోంది. అవినీతిరహితంగా పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇవ్వడం లేదు.
సవాళ్ళు క్లిష్టమయిన పరిస్థితులను అధిగమిస్తున్నాం. కరెంట్ కోతల నుంచి విముక్తి కల్పించిన రాష్ట్రం తెలంగాణ.తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఇది పేదల బడ్జెట్. క్యాపిటల్ వ్యయం 29,728.44 కోట్లు. రెవిన్యూ వ్యయం 1,89,274.82 కోట్లు. జహీరాబాద్ నిమ్స్ కు కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు.
దళితబంధుకు రూ.17,700 కోట్లు. పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు. పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. అతి తక్కువ కాలంలో వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. పేదలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకెళుతుందని సీఎం కేసీఆర్ భావించారు. అందుకే ప్రతి పథకం వారికి అందేలా చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ పేదల కోసం పథకాలు అవలంభిస్తున్నాం. దళిత జాతి అభ్యున్నతికి దళిత బంధు పథకం ఒక దిక్సూచీ. దళిత జాతి ఆర్థిక ప్రగతికి ఇది సాధనం కానుంది. ప్రతి దళిత కుటుంబానికి ఉపాధికోసం 10 లక్షలు అందిస్తాం.
ఎస్టీ సంక్షేమం 12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం 5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లకు 2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు 11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు 12 వేల కోట్లు కేటాయింపు.
శాసనసభ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్. ఈటల, రఘునందన్, రాజాసింగ్ సస్పెన్షన్. బడ్జెట్ సెషన్ ముగిసేవరకూ సస్పెన్షన్.
మన ఊరు మన బడికి రూ7289 కోట్లు. గురుకుల విద్యకు భారీగా నిధులు. దేశంలో ఎక్కువ గురుకులాలు వున్న రాష్ట్రం తెలంగాణ. అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన. రూ.75 వేల లోపు పంట రుణాల మాఫీ.
సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం. సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం. సొంతస్థలం ఉన్న 4 లక్షల మందికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం.
నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపు. ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు కేటాయింపు. నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇండ్లు కేటాయింపు. సీఎం పరిధిలో నిర్వాసితులు, ప్రమాదబాధితులకు ఇండ్ల కేటాయింపు.
వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు
పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం.
హరితహారానికి రూ. 932 కోట్లు
దళితబంధుకు రూ. 17,700 కోట్లు
కొత్త వైద్య కాలేజీలకు రూ. 1000 కోట్లు
పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగులో వైద్య కళాశాలలు
నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు
వ్యవసాయరంగానికి 5 గంటల విద్యుత్ ఇవ్వమని అడిగితే సమైక్య రాష్ట్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసింది. రాష్ట్రంలో ఊహకందని రీతిలో పంటల దిగుబడి వచ్చింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ రంగంలో డిమాండ్ వుంది.
దేశంలో పామాయిల్ సాగుకి తెలంగాణ అనుకూలం అయింది. రాష్ట్రంలో విరివిగా పామాయిల్ సాగుకి ప్రాధాన్యత ఇచ్చింది. పామాయిల్ సాగుని ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల సమావేశాల కోసం రైతు వేదికలు ఏర్పాటుచేస్తోంది. ఇలాంటి సదుపాయం ఎవరూ కల్పించలేదు. వ్యవసాయచట్టాలపై రైతులు డిమాండ్ చేశారు. లక్షలాదిమంది రైతులు ఏడాదిన్నరపాటు ఆందోళన చేశారు. రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎరువుల సబ్సిడీపై కోత విధించింది. ఎరువుల ధరలు పెరిగితే రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడడం లేదు. పనుల కోసం ఇతర ప్రాంతాల వారు తెలంగాణకు వస్తున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలు ముందుకెళుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. గ్రామీణ జీవితం ఎంతో మారిపోయింది.
2022..23 లో ప్రభుత్వ ఆదాయం అంచనా
స్టాంప్డ్, రిజిస్ట్రేషన్స్ ద్వారా 15 వేల 600 కోట్లు
సేల్స్ టాక్స్ ద్వారా 33 వేల కోట్లు
ఎక్సైజ్ ద్వారా 17 వేల 500 కోట్లు
వెహికిల్స్ పై టాక్స్ ద్వారా 4 వేల 953 కోట్లు
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 18 వేల 394 కోట్లు
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ 41 వేల ఒక కోటి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం
మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు మోటారు సైకిళ్లు
దూపదీప నైవేద్య పథకంలోకి కొత్తగా 1,736 ఆలయాలు
దూపదీప నైవేద్య పథకానికి రూ.12.50 కోట్లు
రూ.1,547 కోట్ల వ్యయంతో వైకుంఠధామాల నిర్మాణం
ప్రతినెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం రూ.227.5 కోట్లు విడుదల
పురపాలక, నగరపాలికల్లో పచ్చదనానికి 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయింపు
మరణించిన నేతన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా
గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో పథకం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్థినులకు హెల్త్, హైజీనిక్ కిట్స్ పథకం
ఏడు నుంచి 12వ తరగతి విద్యార్థినులకు హెల్త్, హైజీనిక్ కిట్స్
2021-22 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,54,860 కోట్లు
2021-22లో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.2 శాతంగా అంచనా
2021-22లో దేశ జీడీపీ 8.9 శాతంగా అంచనా
ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.1 శాతంగా అంచనా
రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.1 శాతంగా అంచనా
దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా అంచనా
దేశ జీడీపీలో 4.97 శాతానికి పెరిగిన తెలంగాణ వాటా
అప్పుల ద్వారా 53 వేల 970 కోట్లు