Telangana Budget 2022-23: రాష్ట్ర బడ్జెట్ హైలైట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం… రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లుగా ఉండగా.. క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లుగా ఉంది.. ఇక, 2022-23 ఏడాది బడ్జెట్ మొత్తం ఎంత? రాబలి ఎలా ఉంది? కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఏ రంగారికి ఎంత కేటాయించారు.. లాంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
- రాష్ట్ర బడ్జెట్ రూ. 2.56 లక్షల కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు
- క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు
- పన్నుల ద్వారా ఆదాయం రూ. 1,08,212 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు
- గ్రాంట్లు రూ. 41,001 కోట్లు
- రుణాలు రూ. 53,970 కోట్లు
- అమ్మకం పన్ను అంచనా రూ. 33 వేల కోట్లు
- ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ. 17,500 కోట్లు
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 15,600 కోట్లు
- ఆర్టీసీ బలోపేతానికి రూ. 1500 కోట్లు కేటాయింపు
- పోలీసుశాఖకు రూ. 9,315 కోట్లు కేటాయింపు
- కాళేశ్వరం సర్క్యూట్‌లో టూరిజం అభివృద్ధి కోసం రూ. 1500 కోట్లు కేటాయింపు
- రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణకు రూ. 1542 కోట్లు కేటాయింపు
- పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2,142 కోట్లు కేటాయింపు
- పరిశ్రమలకు విద్యుత్ రాయితీల కింద రూ. 190 కోట్లు కేటాయింపు
- పావలా వడ్డీ పథకానికి రూ. 187 కోట్లు కేటాయింపు.
- మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు కేటాయింపు
- కొత్త వైద్య కాలేజీలకు రూ. 1000 కోట్లు కేటాయింపు
- అటవీ విశ్వవిద్యాలయాలకు రూ. 100 కోట్లు కేటాయింపు
- మన ఊరు – మన బడి పథకానికి రూ. 3,497 కోట్లు కేటాయింపు
- వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయింపు
- పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు కేటాయింపు
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
- రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీకి నిర్ణయం
- పంట రుణాలు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ, ఈ దఫాలో 5.12 లక్షల మంది రైతులకు రుణ మాఫీ
- ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు కేటాయింపు
- దళిత బంధుకు రూ. 17,700 కోట్లు కేటాయింపు
- ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు కేటాయింపు
- బీసీల సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు కేటాయింపు
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 2,750 కోట్లు కేటాయింపు
- బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు కేటాయింపు
- దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లు కేటాయింపు
- సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
- సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం
- నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు కేటాయింపు, ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు కేటాయింపు
- డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు కేటాయింపు
- పల్లె ప్రగతికి రూ. 3330 కోట్లు కేటాయింపు
- పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు కేటాయింపు
- హరితహారానికి రూ. 932 కోట్లు కేటాయింపు
- హైదరాబాద్ మెట్రో సిటీ పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచిత నీటి పథకానికి రూ. 300 కోట్లు
- పాతబస్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు కేటాయింపు
- అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు కేటాయింపు
- ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు కేటాయింపు
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు కేటాయింపు
- వోఆర్ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు రూ. 1200 కోట్లు కేటాయింపు.
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
తాజావార్తలు
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్‌కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
-
Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?