తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు.
కేటీఆర్ కు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు.
Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు ఏం చేసారు? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. విద్యార్థుల కళ్ళలో కేసిఆర్ మట్టి కొట్టారని సంచలన వ్యాఖ్యాలు చేశారు.