సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్, నాందేడ్ నేషనల్ హైవే లపై రూ.18.61 కోట్ల వ్యయంతో పూలబాటలు పూర్తి చేసింది హెచ్ఎండిఏ. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, ప్రతిపక్ష మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పేపర్ లీక్ విషయంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.