Jagga Reddy Demands CM KCR To Cancel Group 1 Exams: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. గ్రూవ్-1 పరీక్షలను వెంటనే రద్దు చేసి, వీటిని మళ్లీ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ని కోరారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్ ‘గ్రూప్-1’ పేపర్‌ను లీక్ చేసినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. వాళ్లు పేపర్‌ని అమ్ముకొని పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోందని, ఇదొక పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. ఎంతోమంది నిరుద్యోగుల, ఉద్యోగుల భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉంటుందని.. అలాంటి టీఎస్‌పీఎస్‌సీలో పని చేసే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ అని.. దీనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీపై పూర్తి నమ్మకం పోయే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. కాబట్టి.. ప్రభుత్వం వెంటనే గ్రూప్-1 పరీక్షలు రద్దు చేసి, మరోసారి పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ వెంటనే ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.
Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
కాగా.. రేణుక అనే అమ్మాయి ప్రవీణ్‌తో ఉన్న సాన్నిహిత్యంతో, తన సోదరుడి పరీక్షల కోసం ప్రశ్నాపత్రం ఇవ్వాల్సిందిగా కోరగా, అతడు నేరుగా ఆమె వాట్సప్ నెంబర్‌కు పంపించడం జరిగింది. పేపర్‌ను సిస్టమ్ నుంచి డౌన్‌లోడ్ చేసేందుకు గాను.. ప్రవీణ్‌కు రాజశేఖర్ అనే వ్యక్తి సహకరించాడని విచారణలో తేలింది. అయితే.. రేణుక సోదరుడు దీనిని ఎక్‌క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, తన సన్నిహితులకు పేపర్ లీక్ చేయడం జరిగింది. అయితే.. డబ్బులిచ్చే విషయంలో తేడా రావడంతో ఓ యువకుడు ఈ పేపర్ లీకైందన్న విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అలా ఈ వ్యవహారం బట్టబయలు అయ్యింది.
Pawan Kalyan: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరం