Etela Rajender: Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు ఏం చేసారు? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. విద్యార్థుల కళ్ళలో కేసిఆర్ మట్టి కొట్టారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. 2014 లో కేసిఆర్ అధికారం చేపట్టక లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఒక్క పరీక్ష కూడా లీక్ కాకుండా జరగలేదు అంటేనే కేసిఆర్ కు విద్యార్థుల మీద ఆసక్తి ఎంతో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి తండ్రులు అనేక ఇబ్బందులు పడి పిల్లల్ని చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ కేసిఆర్ ఈరోజు కన్నీళ్లు తెప్పిస్తున్నారని మండిపడ్డారు. పరీక్షల రద్దు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Read also: VC Sajjanar: స్వప్నలోక్ ఘటనపై సజ్జనార్ సీరియస్.. Qనెట్‌పై దర్యాప్తు చేయండి
పేపర్ లీకేజి యాదృచ్ఛికమా! లేక ఇంటెన్షా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి ఎలా గెలిచారు అనే దాని మీద ఉన్న ఆసక్తి పేపర్ లీకేజి రివ్యు మీద లేదని ఆరోపించారు ఈటెల. దీనికి సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని అన్నారు. పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థుల్లో అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్ ని కోరామన్నారు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలని పిలుపు నిచ్చారు. రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Bus Accident: పుల్వామాలో బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు