Bandi Sanjay: ఎంతమంది చచ్చినా.. కేసీఆర్, కేటీఆర్ స్పందించరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Fires On CM KCR And KTR: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ధ్వజమెత్తారు. ఇంత పెద్ద అగ్ని్ప్రమాదం జరిగి, ఎంతమంది చనిపోతున్నా.. మున్సిపల్ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రాకపోవడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటోందే తప్ప.. గతంలో జరిగిన, ఇప్పుడు జరిగిన అగ్నిప్రమాదాలపై కనీసం సమీక్ష కూడా చేయడం లేదని మండిపడ్డారు. సచ్చినోళ్ళకు సంతాపం.. బతికి ఉన్నోళ్లకు పరిహారం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు అని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పొట్టి కూటి కోసం నగరానికి వచ్చి, ప్రాణాలు పోగొట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గమంతా లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత కోసం వెళ్లింది కానీ, ఈ ఘటనపై స్పందించరని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి, మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్
Also Read
ఇదే సమయంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో నిందితురాలైన రేణుక ఒక బీఆర్ఎస్ నేత కూతురని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వగా.. బీజేపీని బద్నాం చేయాలని చూశారన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గురించి ఆరా తీయకుండానే.. ఎంక్వైరీ చేయకుండానే.. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనిపించాయని అన్నారు. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేవలం ఈ ఎన్నికల్లో కావు.. అసెంబ్లీ, పార్లమెంట్, ఇంకా ఏ ఎన్నికలొచ్చినా.. తెలంగాణలో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
NTR30: ఎన్టీఆర్ 30 పూజకు గెస్ట్ గా చిరు.. నిజమైతే ఎంత బావుండు
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!