Revanth Reddy: కేటీఆర్ కు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? అంటూ ప్రశ్నించారు. బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీ కి పంపించిన కేసీఆర్.. పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Read also: TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు
ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ పిలుపు నిచ్చారు. పేపర్ లీక్ వ్యవహారంపై 22న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్ ను కలుస్తామన్నారు. బీఆర్‌ఎస్ , బీజేపీ కుమ్మక్కు ఏమిటో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆగమైతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదు? అంటూ ప్రశ్నించారు. తక్షణమే కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి, సిట్టింగ్ జడ్జి తో, లేదా సీబీఐ తో విచారణ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంసెట్, ఏఈ, సింగరేణి, విద్యుత్ శాఖ, గ్రూప్-1 పేపర్లు లీక్ అయ్యాయని, రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ దొంగలు, పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయని ఆరోపణలు గుప్పించారు రేవంత్. పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పోరాడుతుందని, కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు కూడా కేసీఆర్ పక్షాన లేడంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR: ప్రగతి భవన్ లో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ భేటీ.. విద్యార్థుల్లో ఉత్కంఠ