తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
Good News From KCR: రంజాన్ మాసం ఆరంభం కానుండడంతో రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కుటుంబంతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు.
Minister KTR: అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
Asaduddin Owaisi: బీహార్ పర్యటనలో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. బీహార్ కిషన్ గంజ్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ కేసీఆర్ పాలనను పొగిడారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన విలువైన పాలనను అందించారని అన్నారు. బీహార్ సీమాంచల్ ప్రాంతంలో పర్యటన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు సర్వ నాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కాలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా రోడ్డు పై కాంగ్రెస్ నిరసన తెలిపారు.
అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని మండిపడ్డారు.