DK Aruna: బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna Fires On BRS Govt For Arresting Bandi Sanjay and Etela Rajender: బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్‌పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. తమ నాయకులతో పోలీసులు వ్యవహరించిన తీరు దౌర్భాగ్యమని మండిపడ్డారు. మహిళా నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. మేము నిరసన తెలపొద్దు కానీ.. మీరు, మీ పార్టీ నాయకులు మాత్రం తెలంగాణలో, దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చా? అని నిలదీశారు.
Jagga Reddy: గ్రూప్-1 పరీక్షలు వెంటనే రద్దు చేయాలి.. ఇదో పెద్ద స్కామ్
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
కాగా.. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ గన్‌పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఈటల కూడా పాల్గొన్నారు. ఈ లీకేజ్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్తున్నట్టు బండి సంజయ్ ప్రకటించడంతో.. పోలీసులు గన్ పార్క్‌ను చుట్టుముట్టారు. అలాగే.. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటలను అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇద్దరికి రక్షణగా కార్యకర్తలు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట చోటు చేసుకుంది. గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బండి సంజయ్, ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ని ఖండిస్తూ బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..