ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది.. సాయంత్రం 4గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు.
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 24న ఆల్ పార్టీ మీటింగ్ ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు (మంగళవారం)…
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఆరవ రోజు కొనసాగనున్నాయి.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇక, అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు ప్రవేశ పెట్టనున్నారు మంత్రి పొంగూరు నారాయణ..
తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతాం అంటూ సదస్సులో…
CM Chandrababu: తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించారు.
Minister Kandula Durgesh: 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.