Off The Record: జోగి రమేష్ ఘటనలో మంత్రి పార్థసారథి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?
- నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ..
- కలిసి పాల్గొన్న మంత్రి సారధి, మాజీ మంత్రి జోగి రమేష్..
- ఒకే వాహనంపై వీధుల్లో భారీ ర్యాలీ..
- మంత్రి మీద ఫైరైపోతున్న టీడీపీ కేడర్..
- అప్పట్లో చంద్రబాబు ఇంటి మీద దాడికి జోగి యత్నం..
- బాబు, పవన్, లోకేష్ మీద తిట్ల దండకాలు..
- టీడీపీ అధిష్టానం ఆగ్రహం, వివరణకు లోకేష్ ఆదేశం..
- సోషల్ మీడియాలో మంత్రిని ఉతికారేస్తున్న తమ్ముళ్ళు..
- పదే పదే వివరణ ఇచ్చుకుంటున్న మంత్రి సారధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రస్తుత మంత్రి పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారా? అంటే… అవుననే అంటున్నారట ఏపీ పొలిటికల్ పరిశీలకులు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. అదే ప్రోగ్రామ్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణకు వెళ్ళే ముందు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఒకే వాహనంపై మంత్రి పార్ధసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి వెళ్ళారు. హాయిగా నవ్వుతూ… కలిసే అందరికీ అభివాదాలు చేస్తూ… ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఒకే వేదికపై కూర్చుని ఆసాంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీన్ కట్ చేస్తే… ఈ సీన్లే… వైరల్ అయి రచ్చ జరుగుతోంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
టీడీపీ కేడర్ అయితే మంత్రి మీద ఓ రేంజ్‌లో ఫైరైపోతోంది. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన, చంద్రబాబు, పవన్, లోకేష్‌లను ఇష్టారీతిన తిట్టిన జోగి రమేష్‌తో కలిసి మంత్రి పార్థసారధి ఎలా ఊరేగుతారంటూ నిలదీస్తున్నారు టీడీపీ లీడర్స్, కార్యకర్తలు. మేటర్ సీరియస్ అవడంతో… మొత్తం వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధిష్టానం… సారధి, గౌతు శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీనిపై వివరణ ఇవ్వాలని ఇద్దర్నీ లోకేష్ ఆదేశించడంతో వ్యవహారం వేడెక్కింది. దీంతో పార్ధసారధి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు సారీ చెప్పారు. అయినప్పటికీ తమ్ముళ్ళు చల్లబడలేదు. సారధి తీరును తప్పు పడుతూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఉతికారేస్తున్నారు. పోస్టులు, వీడియోలు వైరల్ అవడంతో… రెండోసారి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సారధి వివరణ ఇచ్చుకునే ప్రయత్నంచేశారు. టీడీపీ క్యాడర్‌ను నొప్పించినందుకు సారీ.. సో.. సారీ.. అంటూ పదే పదే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు మంత్రి. కార్యక్రమం ప్రభుత్వం లేదా పార్టీ ఆధ్వర్యంలో జరగలేదని, స్థానికంగా ఉన్న గౌడ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిందని, తనను పిలిస్తే వెళ్ళాను తప్ప.. ఎవరెవరు అందులో పాల్గొంటున్నారన్నది తెలియదని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సారధి. జోగి రమేష్‌ను కార్యక్రమంలో చూసి తాను కూడా షాకయ్యానని, అయినప్పటికీ టీడీపీ శ్రేణులకు సారీ చెబుతున్నానని అన్నారాయన. అయినా తెలుగుదేశం కేడర్ మాత్రం తగ్గడం లేదట. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఏమీ తెలుసుకోకుండానే మంత్రి గుడ్డిగా ఓ కార్యక్రమంలో పాల్గొంటారా అంటూ సోషల్ మీడియా వేదికగానే నిలదీస్తోంది కేడర్.
Read Also: Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు
వైసీపీ హయాంలో ఐదేళ్ళపాటు పార్ధసారధి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి పెనమలూరు నుంచి నూజివీడుకు మారి పోటీ చేసి గెలిచి మంత్రయ్యారు. కొత్తగా నెలల ముందు మాత్రమే పార్టీలో చేరినా… సారధికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు సీఎం చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో… గతంలో చంద్రబాబును నోటికొచ్చినట్టు తిట్టడమే కాకుండా, ఏకంగా ఆయన ఇంటిపై దాడికి వెళ్ళిన జోగి రమేష్‌తో కలిసి సారధి ఎలా ర్యాలీలో పాల్గొంటారు? ఒకే వేదికను ఎలా పంచుకుంటారన్నది టీడీపీ శ్రేణుల క్వశ్చన్ అట. అందుకే సారధిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ జోగి రమేష్, సారధి ఒకే తాను ముక్కలంటూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇక పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి తీరుపై మండిపడ్డారు. మంత్రి ఆలోచనల్లో నిజాయితీ ఉంటే… జోగి రమేష్‌ను చూసిన వెంటనే వాహనం నుంచి దిగి వెళ్లిపోవాలి కదా? అలా కాకుండా ఆయనతో ఎందుకు అంటకాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా. ఈ పరిస్థితుల్లో మంత్రి సారధి ఎంతలా వివరణ ఇచ్చుకున్నా… పూర్తి స్థాయిలో జోగి రచ్చ నుంచి బయటపడలేక పోతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక గౌడ సామాజికవర్గంలోని వైసీపీనేత ఆహ్వానంతోనే జోగి రమేష్ ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటారని సారధి చెబుతున్నా… ఒకే వాహనంపై ఎలా ర్యాలీగా వెళ్తారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారట మంత్రివర్యులు. అందుకే టీడీపీ శ్రేణులకు పదే పదే సారీ చెబుతూ సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా చూస్తున్నవారు మాత్రం జోగి ఎపిసోడ్‌లో పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారు. ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!