Speaker Ayyanna Patrudu: అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో మూడు లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలిందన్నారు.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు అయ్యిందన్నారు.. ప్రతినెల ఒక్కొక్కరికి పెన్షన్ రూపంలో 4 వేలు రూపాయలను మంజూరు చేస్తున్నారు.. దొంగ పెన్షన్లు కారణంగా నెలకు పెన్షన్లు రూపంలో 120 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందన్నారు.. అంటే సంవత్సరానికి 1,440 కోట్లు, ఐదు సంవత్సరాలకు 7,200 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగిందన్నారు.. ఇదే సొమ్ముతో మూడు తాండవ రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు అన్నారు.. ఇక, దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ… దొంగలే అని అంటాను.. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను.. చూద్దాం అని అన్నారు. ఇక్కడ చెప్పొచ్చో లేదో అంటూనే.. ఎవరేమనుకున్నా లెక్క చేయనంటూ తన పాత తరహా పందాలోనే నా స్టైలే వేరు అంటూ.. ప్రసంగించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. కాగా, అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: KTR: ఫార్ములా ఈ- కార్ రేస్ కేసుపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్..