ఉగ్రవాదులు భారత్ను భయ పెట్టలేరు.. ఎందుకంటే.. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్కు పరోక్షంగా సవాల్ విసిరారు. ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోడీ అన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను వీక్షించిన ఆయన ఆ ఘటనపై స్పందించారు. ‘‘ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన…
Margani Bharat: వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మళ్లీ బాబు బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. ఎస్జీ ఎస్టీపై ఒక శాతం సర్ ఛార్జ్ విధించుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వడంపై మండిపడ్డారు.
తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు రామ్మూర్తి నాయుడు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే.. హైదరాబాద్ బయల్దేరనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట రామ్మూర్తి నాయుడు.. అయితే, తన చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం అందుకున్న మంత్రి నారా లోకేష్.. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని.. అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో శుక్రవారం భేటీ అయ్యారు..
మూడంతస్తుల బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారుల సాహస దృశ్యాలు వైరల్ మహారాష్ట్రలోని పూణె నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హదప్సర్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మధ్య ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతుండగా పక్క ఫోర్సన్లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయారు. నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఏ మాత్రం కంట్రోల్ కాలేదు. క్రమక్రమంగా మంటలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఓ చిన్నారి దిగే ప్రయత్నం చేసినా…
దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో గిరిజనుల గొప్ప సహకారం ఉంది : ప్రధాని మోడీ ధర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బీహార్లోని జాముయ్లో ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించి, ఆయన పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 6000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా బహుమతిగా ఇచ్చారు. దీనితో పాటు గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేయడానికి గత ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోడీ అన్నారు. గత ప్రభుత్వాల వల్ల గిరిజన సమాజం…
ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్గా ఏపీ అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలను రూపొందించాం అన్నారు.. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయి.. 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం,…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇక, రఘురామకృష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సినిమా రంగంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో (రఘు రామకృష్ణం రాజు) 'ఆర్ఆర్ఆర్' కూడా ఓ సంచలనంగా పేర్కొన్నారు..