AP Cabinet Meeting: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. వాటిపైనే ఫోకస్..
- సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపే ఏపీ కేబినెట్ భేటీ..
- ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం..
- పలు కీలక అంశాలపై చర్చ.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ న్యూ లుక్.. కొత్త హెయిర్ స్టైల్ (వీడియో)
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.. మరోవైపు.. కాకినాడ పోర్ట్‌లో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది.. ఈ తరుణంలో పీడీఎస్ రైస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!