CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌కు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాల భూమి ఇస్తామని తెలిపారు.. దేశంలో ఏ AIIMS కు కూడా ఇలాంటి భూమి లేదు.. అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ.. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. 960 బెడ్లు ఉన్న ఆసుపత్రి… 1618 కోట్లు ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి.. మంగళగిరి ఎయిమ్స్ సొంతంగా అభివర్ణించారు.. డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధవానంద కర్ అంటున్నారు.. అందుకే ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు..
Read Also: IND vs AUS: ముగిసిన నాలుగో రోజు ఆట.. ఫాలో ఆన్ గండం తప్పించుకున్న టీమిండియా
ఇక, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు సీఎం చంద్రబాబు.. ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వడం ఆవిడ సాధించిన విజయంగా పేర్కొన్న ఆయన.. కష్టపడితే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీలేదు అనడానికి ద్రౌపది ముర్ము జీవితం ఒక ఉదాహరణ అన్నారు.. అవకాశం ఉంటే నాకు ఇక్కడ చదువుకోవాలని ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం.. భవిష్యత్తులో ఎయిమ్స్ మంగళగిరికి ఎలాంటి మౌళిక సదుపాయాల లోటు ఉండనివ్వం.. కొలనుకొండ లో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనుకుంటున్నారు.. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్ గా మారిపోయింది… డీప్ టెక్ ను మెడికల్ లో కూడా అమలు చేయాలనుకుంటున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..