Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజు (డిసెంబర్ 17) జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్‌లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందిస్తారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎయిమ్స్‌ను మంజూరు చేయగా.. ఎయిమ్స్ ప్రాంగణంలో 2020 నుంచి 125 సీట్లకు పర్మిషన్ పొంది ఆ మేరకు విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.
Read Also: Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
అయితే, నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి వస్తుండటంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ప్రకటించారు. నేటి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలన్నీ ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉందన్నారు.
Read Also: Off The Record: భూమా కుటుంబంలో ఏం జరుగుతుంది..?
ఇక, చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ-పామర్రు-గుడివాడ-హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్లీంపు..
* వైజాగ్ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వెళ్లే వెహికిల్స్ హనుమాన్ జంక్షన్- గుడివాడ, పామర్రు, అవనిగడ్డ మీదుగా మళ్లీంపు.. * విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని జిల్లా ఎస్పీ గంగధారరావు సూచించారు. * వాహనదారులు ఈ హెచ్చరికలను గమనించి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.