“బంగ్లాదేశీయుడి”గా పొరబడి వలస కార్మికుడి దారుణ హత్య.. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు సగటు భారతీయుడిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బంగ్లాలోని మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను మతోన్మాద మూక ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది భారతీయుల్లో కోపానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే, కేరళలో వలస కార్మికుడిని ‘‘బంగ్లాదేశ్ వ్యక్తి’’గా పొరబడి దారుణంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్…
బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు.. బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఆ దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి. ఇదే కాకుండా, అంతర్గత వర్గ పోరును కూడా భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య. దీంట్లో భారత ప్రమేయం ఉందని చెబూతూ, అక్కడి మతోన్మాద మూక ఢాకాలోని భారత…
ఇది దేశానికి చాలా కీలకమైన సమయం అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ బ్రాండ్‌ను ప్రపంచమంతటా గుర్తింపు పొందే స్థాయికి తీసుకువచ్చారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రైట్ టైమ్, రైట్ లీడర్, రైట్ డెసిషన్.. నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని సీఎం ఆకాక్షించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను ఢిల్లీలో చంద్రబాబు కలిసి అభినందించారు. అనంతరం ఏపీ…
సీఎం చంద్రబాబుతో రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగింసింది. రెండు రోజుల్లో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ముగింపు ఉపన్యాసంలో పీపీపీ వైద్య కళాశాలల సహా వివిధ అంశాలను ప్రస్తావించారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురాగలిగాం అని, రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో యూనిట్‌కు రూ.1.20 మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పీపీపీ మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ముందుకు వస్తే, అధికారంలోకి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కిన అరుదైన గౌరవంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మక ‘ఎకనమిక్ టైమ్స్’ సంస్థ ఆయనను ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఎంపిక చేయడంపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయకత్వ శైలి నవతరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన అమలు…
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుందని.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా? అని ప్రభుత్వాన్ని జగన్ప్రశ్నించారు. ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండని.. తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామన్నారు. వైసీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు…
రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రేపు వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వరుస భేటీల అనంతరం శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా-జాతీయ…
సంక్షేమ శాఖలపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపోందించాలని.. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. పార్వతిపురం మన్యం జిల్లాలో జరుగుతోన్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండని, హాస్టళ్లలో విద్యార్ధులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత మాట్లాడతానని హెచ్చరించారు. కలెక్టర్లతో మొదటి…
కేంద్ర ప్రయోజిత పథకాలు, నిధుల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పెండింగులో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని మంత్రి చెప్పారు.…
మాజీ సీఎం వైఎస్ జగన్ విజన్‌తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఉండాలన్నది సంకల్పించారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం అని.. ఇది…