సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
నగరంలోని పలు చెరువులను హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల రావడంతో రంగనాథ్ తనిఖీలు చేపట్టారు. నానక్‌రామ్ గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం బాణసంచాపై "శాశ్వత నిషేధం" విధించారు.
Water Supply: జలమండలిలోని ఓఅండ్‌ఎం డివిజన్-2లోని బాలాపూర్ రిజర్వాయర్ కింద గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు ఎస్‌ఎన్‌డీపీ డ్రెయిన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి.
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
Sankranthi: తెలుగువారి పెద్ద పండుగ.. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇల్లు, ఆఫీసు... ఇలా నాలుగు గోడల మధ్య చిక్కుకుని నగర జీవితానికి అలవాటు పడిన పట్నం వాసులు చాలా మంది పల్లెలకు వెళ్లి అన్నదమ్ములతో కలిసి పండుగ చేసుకున్నారు.
యుద్ధం అంటే ప్రజలు ఎంతో భయపడతారు. యుద్ధం వస్తే ఆయా దేశాల్లోని ప్రజలకు తీవ్ర కష్టాలు ఉంటాయి. సాధారణంగా యుద్ధంలో ఫిరంగులు.. క్షిపణులు.. తూటాలు.. తుపాకులను ఉపయోగిస్తారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.10 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. నగరంలో ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు నిలకడగా వుండటంతో..హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 స్థిరంగానే ఉన్నాయి. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్…
చిన్న చిన్న దేశాల అవసరాలను తెలుసుకొని వాటికి సహాయం చేసి మెల్లిగా ఆ దేశంలో పాగా వేయడం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. గతంతో బ్రిటీష్ పాలకులు చేసిన విధంగానే ఇప్పుడు డ్రాగన్ పాలకులు చేస్తున్నారు. పాక్‌కు కావాల్సనంత డబ్బులు ఇచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది. ఇటు శ్రీలంకను సైతం అదేవిధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నది డ్రాగన్. కాగా ఇప్పుడు దృష్టిని కువైట్‌వైపు మళ్లించింది. కువైట్ ప్రస్తుతం అల్ షకయా ఎకనామిక్ సిటీని…