Sankranthi: తెలుగువారి పెద్ద పండుగ.. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇల్లు, ఆఫీసు… ఇలా నాలుగు గోడల మధ్య చిక్కుకుని నగర జీవితానికి అలవాటు పడిన పట్నం వాసులు చాలా మంది పల్లెలకు వెళ్లి అన్నదమ్ములతో కలిసి పండుగ చేసుకున్నారు. నగరంలో బస చేసిన గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ వాసులు ఈసారి కలిసి పండుగ జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా.. రాజధాని నగరం హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే వీధివీధినా, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ముందు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం అందరికి కనువిందుచేస్తోంది.
Read also: Rahul Gandhi : రెండో రోజు మణిపూర్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర
వీధుల్లో అందమైన రంగవల్లులు..
రాత్రిపూట ఆడవాళ్లంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ.. వీధుల్లో అందమైన రంగవల్లులను వేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్ల అంతస్తులపై పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. మొత్తానికి.. సామాన్యుడి సందడి ఇలా ఉంటే.. ఇప్పటికే సెలబ్రిటీలు, వ్యాపారులు, ధనవంతులు నగర శివార్లలోని తమ ఫాంహౌస్‌లకు చేరుకుని పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, వారికి కావాల్సిన వారిని అక్కడికి ఆహ్వానించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నగర శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతిని జరుపుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీ ఈసారి మరింతగా ఏర్పాట్లు చేశారు. అక్కడ అసలైన పల్లెటూరి వాతావరణాన్ని మళ్లీ సృష్టించి, తన స్నేహితులకు, బంధువులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాడు. చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఇదే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల నుంచి కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు ఈసారి పండుగకు ఇంటికి వచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కుంటుంబాలతో సంతోషంగా గుడుపుతున్నారు.
Read also: India-Maldives row: దానికి నేను హామీ ఇవ్వలేను.. భారత్-మాల్దీవుల వివాదంపై జైశంకర్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ధనిక కుటుంబాలు తమ ఇంటి ఆవరణలోనే కోడి పందేలు, పేకాట నిర్వహించడం గమనార్హం. ఆనందంగా తిలకిస్తున్నారు. పిండివంటలతో ఘుమఘుమలతో వీధి వీధి అంతా రంగ వల్లులతో అందరిని అలరించుకుంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్ వచ్చిన లక్షలాది మంది సంక్రాంతికి ఇళ్లకు వెళ్లగా, శనివారం నుంచి రాజధాని వీధులన్నీ యథావిధిగా ఖాళీగా కనిపించాయి. అపార్ట్‌మెంట్ల వద్ద భోగి మంటల సందడి ఎక్కువగా కనిపించింది. కొన్ని అపార్ట్ మెంట్లలో అయితే ఈసారి గ్రామాలకు వెళ్లిన వారు తప్ప మిగతా వారంతా కలిసి సంక్రాంతి చేసుకునేందుకు ప్లాన్ వేసుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమను పల్లెలో చేసుకున్నట్లు చేసుకునేందుకు ఆర్భాటం చేస్తున్నారు. ఆ లోటు తెలియక మా అపార్ట్‌మెంట్ వాసులంతా కలిసి ఇక్కడే పండుగ చేసుకునేందుకు సిద్దమయ్యారు. సంక్రాంతి వేడుకలను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో టిక్కెట్టు పొందిన ఈవెంట్‌గా నిర్వహిస్తు అందరిని ఒకచోట చేర్చి సంక్రాంతి వాతావరణాన్ని, సంబరాలను చేసుకుంటున్నారు.
Hyderabad: టీఎస్ఆర్టీసీ బస్సుపై పోకిరీల రాళ్లదాడి.. ప్రశ్నించిన డ్రైవర్, కండక్టర్‌పై కత్తితో..