ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.10 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. నగరంలో ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు నిలకడగా వుండటంతో..హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 స్థిరంగానే ఉన్నాయి.
వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 33 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.54 కాగా, 30 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.97.70 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.85 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.99 అయింది. నిజామాబాద్‌లో 16 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.33 కాగా, డీజిల్‌పై 16 పైసలు పెరిగి లీటర్ ధర రూ.99.38 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు తగ్గాయి. 35 పైసలు తగ్గడంతో ఇక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.111.54 కాగా, 32 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.31 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 82 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.48 అయింది. డీజిల్‌పై 76 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో పెట్రోల్ పై 31 పైసలు పెరగడంతో లీటర్ రూ.112.86 కాగా, డీజిల్‌పై 29 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.100.48 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
Suicide: ఉన్నతాధికారుల వేధింపులు.. నిమ్స్ ఉద్యోగిని ఆత్మహత్య?